Atchannaidu: అరాచకాలు సాగవన్న భయంతోనే అడ్డుకున్నారు: అచ్చెన్నాయుడు

Atchannaidu welcomes high court verdict on ap local polls
  • హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
  • అమ్మఒడి సభకు రాని కరోనా అడ్డంకి.. ఎన్నికలకు ఎందుకు?
  • ప్రజల మద్దతు ఉంటే భయమెందుకు?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉన్నంత వరకు తమ ఆటలు సాగవన్న ఉద్దేశంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకున్నారన్న ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. ఉద్యోగ సంఘాలను కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలును హైకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన ఆయన.. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు.

కరోనా పేరు చెప్పి ఎన్నికలను అడ్డుకున్నారని, మరి అమ్మఒడి సభను వేలాదిమందితో నిర్వహించేందుకు కరోనా అడ్డు రాలేదా? అని ప్రశ్నించారు. ప్రజల మద్దతు ఉందని చెప్పుకుంటున్న వైసీపీకి నిజంగా అదే నిజమైతే ఎన్నికలకు వెళ్లేందుకు భయమెందుకని అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు.
Atchannaidu
TDP
Andhra Pradesh
YSRCP
Electcions
AP High Court

More Telugu News