Bandi Sanjay: సీఎం పదవిని కేటీఆర్ కు ఇవ్వరు.. కేసీఆరే సీఎంగా ఉంటారు: బండి సంజయ్

KCR wont make KTR as CM says Bandi Sanjay
  • కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
  • ఆ ప్రచారంలో నిజం లేదన్న బండి సంజయ్
  • పార్టీ కూలిపోతుందనే ప్రచారాన్ని కేసీఆరే చేయిస్తారు
త్వరలోనే ముఖ్యమంత్రి పగ్గాలను తన కుమారుడు కేటీఆర్ కి కేసీఆర్ అందజేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ పార్టీలో జరగబోయే పరిణామాల గురించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆలోచన కేసీఆర్ కు లేదని ఆయన అన్నారు. మరో 15 రోజుల్లో కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారంలో నిజం లేదని చెప్పారు.

తమకు మంత్రి పదవి రాకపోతే  కొత్త పార్టీ పెడతామని ఇప్పటికే ఆ పార్టీలోని  ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు అంటున్నారని... ఈ మాటలను వారితో అనిపిస్తోంది సాక్షాత్తు కేసీఆరే అని తెలిపారు. కొత్త పార్టీ పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని... అందువల్ల సీఎం కావాలనే ఆలోచనను కొన్ని రోజులు పక్కన పెట్టాలని కేటీఆర్ కు కేసీఆర్ చెపుతారని... తద్వారా కొడుకును సీఎంని చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ వాయిదా వేస్తారని చెప్పారు.

గతంలో సంతోష్ రావుతో ఇలాంటి వ్యాఖ్యలు చేయించిన కేసీఆర్... ఇప్పుడు ఎమ్మెల్యేలతో ఆ మాట చెప్పిస్తున్నారని అన్నారు. ఇప్పట్లో కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేయబోరని అన్నారు. సీఎం సీటులో కేసీఆరే ఉంటారని చెప్పారు.
Bandi Sanjay
BJP
KCR
KTR
TRS
CM

More Telugu News