K Kavitha: బోధన్ పర్యటనకు వెళ్తూ మార్గ‌మ‌ధ్యంలో కారు ఆపి.. స్థానికుల‌తో క‌ల్వ‌కుంట్ల క‌విత ఫొటోలు

kavita takes photos with bodhan people
  • ఇందల్వాయి గేటు వద్ద స్థానికులతో ఫొటోలు
  • స్థానికుల‌తో మాట్లాడిన క‌విత‌
  • ట్విట్ట‌ర్ లో ఫొటోలు, వీడియో పోస్ట్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈ రోజు ఉద‌యం బోధన్ పర్యటనకు వెళ్లే స‌మ‌యంలో మార్గ‌మ‌ధ్యంలో ఆగి స్థానికుల‌తో ముచ్చ‌టించారు. ఇందల్వాయి గేటు వద్ద స్థానికులతో ఆమె మాట్లాడి వారితో ఫొటోల‌కు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోల‌ను ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

క‌విత‌తో ఫొటోలు దిగినందుకు స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఫొటోలు దిగిన అనంత‌రం మ‌ళ్లీ క‌విత త‌న కారులో బోధ‌న్ కు వెళ్లారు. అక్క‌డ నిర్వ‌హిస్తోన్న ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆమె పాల్గొన‌నున్నారు.
K Kavitha
TRS
bodhan

More Telugu News