KGF Chapter 2: 'ఆర్ఆర్ఆర్', 'మాస్టర్'లను దాటేసిన 'కేజీఎఫ్-2'!

KGF Chapter 2 Creates Record in Views
  • యష్ హీరోగా రానున్న కేజీఎఫ్ చాప్టర్ 2
  • సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి కో స్టార్స్
  • పదిన్నర గంటల వ్యవధిలో 20 లక్షల వ్యూస్
కన్నడ స్టార్ యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, రామికా సేన్ తదితరులు నటించగా, ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ గా నిలిచిన 'కేజీఎఫ్' చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న "కేజీఎఫ్-చాప్టర్ 2" విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైన 10 గంటల వ్యవధిలోనే రాజమౌళి "ఆర్ఆర్ఆర్", విజయ్ హీరోగా రానున్న "మాస్టర్" చిత్రాలను దాటేసింది.

యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన తరువాత 10 గంటలా 30 నిమిషాల వ్యవధిలో "కేజీఎఫ్ - చాప్టర్ 2" 20 లక్షల వ్యూస్ ను తెచ్చుకుంది. ఇదే సమయంలో తొలి పదిన్నర గంటల వ్యవధిలో 'మాస్టర్' 18.5 లక్షలు, 'సర్కార్' 11.8 లక్షలు, 'ఆర్ఆర్ఆర్' (రామరాజు ఫర్ బీమ్) 9.41 లక్షలు, 'మెర్సెల్' 7.82 లక్షల వ్యూస్ ను తెచ్చుకున్నాయి. ఇక 7వ తేదీన టీజర్ విడుదల కాగా, ఇంతవరకూ 11 కోట్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.



KGF Chapter 2
Views
You Tube

More Telugu News