ఇండోనేషియాలో బోయింగ్ విమానం అదృశ్యం
- జకార్తా నుంచి పాంటియానక్ వెళ్లాల్సిన విమానం
- టేకాఫ్ అయిన కాసేపటికే అదృశ్యం
- ఏటీసీతో తెగిపోయిన సంబంధాలు
- విమానంలో 62 మంది ప్రయాణికులు
ఘటనపై స్పందించిన ఇండోనేషియా అధికారులు రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. కాగా, ఫ్లైట్ రాడార్ 24 అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.... టేకాఫ్ అనంతరం 11 వేల అడుగుల ఎత్తుకు చేరిన ఈ బోయింగ్ విమానం ఒక్కసారిగా 250 అడుగుల ఎత్తుకు జారిపోగా, ఆ తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం దీనికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన తర్వాత సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు.