New Strain: అమెరికాలో మరో రకం కరోనా... బ్రిటన్ రకంతో పాటు విజృంభిస్తున్న వైనం!

New corona strain in US
  • అమెరికాలో రోజువారీ కేసులు, మరణాల పెరుగుదల
  • అమెరికా రకం కరోనా వల్లనే అని గుర్తించిన నిపుణులు
  • ఇప్పటికే అమెరికాలో బ్రిటన్ కరోనా స్ట్రెయిన్
  • రాష్ట్రాలకు హెచ్చరికలు చేసిన వైట్ హౌస్ కరోనా టాస్క్ ఫోర్స్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయం సృష్టించిందనే చెప్పాలి. కొన్ని నెలల కిందట వరకు అమెరికా ప్రాణాంతక వైరస్ ప్రభావంతో విలవిల్లాడింది. ఇటీవలే అమెరికాలో బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కూడా ప్రవేశించింది. అయితే, బ్రిటన్ రకం కరోనాకు తోడు మరో కొత్తరకం స్ట్రెయిన్  అమెరికాలో వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా మళ్లీ పెరుగుతుండడంతో ఇది అమెరికా రకం కరోనా వైరస్ వల్లనే అని గుర్తించారు.

దీనిపై వైట్ హౌస్ కరోనా టాస్క్ ఫోర్స్ రాష్ట్రాలకు హెచ్చరికలు చేసింది. అమెరికా రకం కరోనా స్ట్రెయిన్ తో 50 శాతం అధికంగా వ్యాప్తి ఉండొచ్చని పేర్కొంది. మాస్కులు ధరించకపోయినా, భౌతికదూరం నిబంధనలు కచ్చితంగా పాటించకపోయినా దీని ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, రూపాంతరం చెందిన కరోనా వైరస్ రకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
New Strain
Corona Virus
USA
Britain
COVID19

More Telugu News