Nasal Vaccine: ముక్కు ద్వారా ఒక్క డోసులో కరోనా వ్యాక్సిన్... మరో పరిశోధనకు సిద్ధమైన భారత్ బయోటెక్

Bharat Biotech eyes on single dose nasal corona vaccine
  • త్వరలో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్
  • వాషింగ్టన్ వర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం
  • ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మనుషులపై క్లినికల్ ట్రయల్స్
  • ఇప్పటికే కొవాగ్జిన్ ను తీసుకువచ్చిన భారత్ బయోటెక్
కొవాగ్జిన్.... భారత్ సగర్వంగా చెప్పుకోగలిగేలా దేశీయంగా తయారైన వ్యాక్సిన్. ఇప్పుడీ కొవాగ్జిన్ భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందింది. మరికొన్నిరోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ఈ నేపథ్యంలో, కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ రెట్టించిన ఉత్సాహంతో మరో వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి అభివృద్ధి పరిచే టీకా ముక్కు ద్వారా తీసుకోగలిగే వీలుంటుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇది ఒక్క డోసు తీసుకుంటే సరిపోతుందని వివరించింది. ఇప్పుడున్న కరోనా వ్యాక్సిన్లన్నీ రెండు డోసుల వ్యాక్సిన్లే.

కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్... ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తో జట్టు కడుతోంది. ఈ ముక్కులో వేసే కరోనా వ్యాక్సిన్ కు BBV154 అని నామకరణం చేసింది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్, అమెరికాలో నిర్వహించిన ప్రీ క్లినికల్ ప్రయోగాలు సఫలం అయ్యాయని, మనుషులపై మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలవుతాయని భారత్ బయోటెక్ వెల్లడించింది.
Nasal Vaccine
Corona Virus
Bharat Biotech
Single Dose
Whashington University

More Telugu News