ఆంధ్రప్రదేశ్ లో మరో ఘటన.. వినాయకుడి విగ్రహం మాయం
- కడప జిల్లాలోని వేముల మండలంలో ఘటన
- చాగలేరు గ్రామంలో వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వైనం
- పోలీసులకు ఫిర్యాదు
ఇప్పుడు ఓ ఆలయంలో దేవుడి విగ్రహాన్ని పూర్తిగా మాయం చేశారు. కడప జిల్లాలోని వేముల మండలం చాగలేరు గ్రామంలో వినాయక విగ్రహాన్ని గత రాత్రి దుండగులు ఎత్తుకెళ్లినట్లు ఈ రోజు ఉదయం గ్రామస్థులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిసరాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.