Vellampalli Srinivasa Rao: బెజవాడ దుర్గమ్మకు వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పిస్తున్న ఏపీ మంత్రి

Minister Vellampalli offers Kanakadurga goddess diamond ornaments
  • ముక్కుపుడక, బొట్టు, బులాకీ సమర్పించనున్న వెల్లంపల్లి
  • రేపు ఉదయం అమ్మవారికి నివేదన
  • ఆభరణాల బరువు 28.380 గ్రాములు
  • నగల విలువ రూ.6.50 లక్షలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు వజ్రాలు పొదిగన ఆభరణాలు సమర్పిస్తున్నట్టు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. వజ్రాలు పొదిగిన ముక్కుపుడక, బొట్టు, బులాకీ అమ్మవారికి అందజేస్తున్నట్టు వివరించారు. రేపు (జనవరి 8) ఈ విలువైన కానుకలను జగన్మాత కనకదుర్గమ్మకు సమర్పిస్తున్నట్టు వెల్లంపల్లి ట్వీట్ చేశారు. వీటి బరువు 28.300 గ్రాములు కాగా, వీటి విలువ రూ.6.50 లక్షలు అని పేర్కొన్నారు. అంతేకాదు, తాను అమ్మవారికి నివేదించే నగల ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు.
Vellampalli Srinivasa Rao
Kanakadurga
Diamond Ornaments
YSRCP
Andhra Pradesh

More Telugu News