AV Subba Reddy: కిడ్నాప్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు: ఏవీ సుబ్బారెడ్డి

Dont have any contact with kidnap says AV Subba Reddy
  • అఖిలప్రియతో నాకు విభేదాలు ఉన్నాయి
  • ఇద్దరం కలిసి ఒకే కేసులో నిందితులుగా ఎలా ఉంటాం?
  • నన్ను చంపించేందుకు గతంలో అఖిలప్రియ సుపారీ ఇచ్చింది
హైదరాబాద్ బోయిన్ పల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావును కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి ఏ1గా, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ఏ2గా, ఆమె భర్త భార్గవ్ రామ్ ఏ3గా కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితం సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.

అంతకు ముందు సుబ్బారెడ్డి ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. తనను ఎందుకు నిందితుడిగా చేర్చారో అర్థంకావడం లేదని చెప్పారు. అఖిలప్రియతో తనకు విభేదాలు ఉన్నప్పుడు... తామిద్దరం ఒకే కేసులో నిందితులుగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. తనను చంపడానికి అఖిలప్రియ గతంలో సుపారీ ఇచ్చిందని చెప్పారు. ప్రవీణ్ రావుతో విభేదాలు ఉన్న మాట నిజమేనని... హఫీజ్ పేట్ భూ వివాదం గురించి ఇప్పుడు మాట్లాడలేనని అన్నారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలను వెల్లడిస్తానని చెప్పారు.
AV Subba Reddy
Bhuma Akhila Priya
Telugudesam
Hyderabad
Kidnap

More Telugu News