మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డికి సోకిన కరోనా!

Corona Positive for Somireddy
  • ఇటీవల స్వల్ప అనారోగ్యం
  • పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్
  • ఇంట్లోనే చికిత్స పొందుతున్న సోమిరెడ్డి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన, తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తానిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని, ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్సను పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, సోమిరెడ్డి గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయనకు మహమ్మారి సోకినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Somireddy Chandra Mohan Reddy
TDP
Telugudesam
Corona Virus

More Telugu News