Vijay Sai Reddy: 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించాడు: విజ‌యసాయిరెడ్డి

vijaya sai slams chandrababu
  • ఏ ఉన్మాద ధ్వంస రచనకైనా సిద్ధమేనని నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడు
  • ఇకపై కొందరికే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించాడు
  • మధ్య యుగాల నాటి ఉన్మాద మనస్త‌త్వంతో చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. కుమారుడి కోసం ఏ ఉన్మాద ధ్వంస రచనకైనా సిద్ధమేనని చంద్ర‌బాబు అంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

'అసమర్థుడైన పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంస రచనకైనా సిద్ధమేనని 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఇకపై తాను కొందరికే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించాడు. మొదట నీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి సూటిగా చెప్పేసేయ్ బాబూ'  అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 
'ముందుకు సాగడం ప్రకృతి నియమం. మధ్య యుగాల నాటి ఉన్మాద మనస్త‌త్వంతో చంద్రబాబు రాకెట్ వేగంతో తిరోగమనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రపంచం పురోగమనం వైపు పరుగులు పెడుతుంటే అందుకోలేనంత వెనక పడిపోయాడని, ఒంటరిగా మిగిలిపోయాడని తొందర్లోనే తెలుస్తుంది' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News