వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణలో 1,500 కేంద్రాల ఏర్పాటు
- భారత్ లో త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ
- వైద్యారోగ్యశాఖ సిబ్బందికి తొలివిడుత టీకాలు
- రెండు డోసులు వేసుకొంటేనే రోగనిరోధక శక్తి
అయితే, రెండు డోసులు వేసుకొంటేనే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. రెండో డోసు వేసుకున్న అనంతరమే కరోనా నుంచి పూర్తి రక్షణ కల్పించేలా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలోనే దేశంలో వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చారని ఐసీఎంఆర్ సంచాలకుడు బల్రామ్ భార్గవ తెలిపారు.