Ratan Tata: మాజీ ఉద్యోగికి అనారోగ్యం... స్వయంగా వెళ్లి పరామర్శించిన రతన్ టాటా!

Ratan Tata in Pune to See his Ex Employee
  • ముంబై నుంచి పూణెకు పయనం
  • రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి పరామర్శ
  • పెద్ద మనసు చాటుకున్న టాటా

తన కంపెనీలో పనిచేసి, మానేసిన ఓ ఉద్యోగి, రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న పారిశ్రామికవేత్త రతన్ టాటా, పెద్ద మనసు చూపారు. ముంబై నుంచి పూణెకు చేరుకున్న ఆయన, మాజీ ఉద్యోగి ఇంటికి వెళ్లి, ఆరోగ్యంపై వాకబు చేశారు. మీడియాకు ఎటువంటి సమాచారం లేకుండా రతన్ టాటా పర్యటన సాగగా, ఆయన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 యోగేశ్ దేశాయ్ అనే వ్యక్తి, తన లింక్డ్ ఇన్ ఖాతాలో టాటా పర్యటన గురించిన వివరాలు పంచుకున్నారు. కాగా, రతన్ టాటా గతంలోనూ అనేక సందర్భాల్లో ఇలా పెద్ద మనసు చాటుకున్నారు. ముంబైపై ఉగ్రదాడులు జరిగిన వేళ, తన సంస్థల్లో పనిచేస్తూ బాధితులుగా మారిన 80 మంది ఉద్యోగుల కుటుంబాలను కలిసిన ఆయన, వారి పిల్లల చదువులకు అవసరమైన సాయం చేశారు.

  • Loading...

More Telugu News