Chiranjeevi: పోలీసు తండ్రీ కూతుళ్ల సెల్యూట్ పై చిరంజీవి స్పందన

Chiranjeevi responds to father daughter salute incident in AP Police Duty Meet
  • పోలీస్ డ్యూటీ మీట్ లో అపురూపమైన క్షణాలు
  • కుమార్తెకు సెల్యూట్ చేసిన తండ్రి
  • తండ్రి సీఐ అని, కుమార్తె డీఎస్పీ అని వివరించిన చిరంజీవి
  • శ్యాంసుందర్ గారూ మీకు నేను సెల్యూట్ చేస్తున్నానంటూ చిరు ట్వీట్
తిరుపతిలో జరుగుతున్న ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా సీఐ శ్యాంసుందర్ తన కుమార్తె, గుంటూరు అర్బన్ (సౌత్) డీఎస్పీ జెస్సీ ప్రశాంతికి సెల్యూట్ చేయడం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన సందడి చేసింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ఆ ఫొటోలో ఉంది తండ్రి-కూతురు అని, తండ్రి సీఐ శ్యాంసుందర్, కూతురు డీఎస్పీ మిస్ జెస్సీ ప్రశాంతి అని వివరించారు. "తన గుండెలమీద ఎత్తుకుని పెంచిన బిడ్డ, తన పై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోల్డంత సంతృప్తిని, గర్వాన్ని, ప్రేమను చూశాను. శ్యాంసుందర్ గారూ, మీకు నేను సెల్యూట్ చేస్తున్నాను. మీ ఇద్దరూ ఇంకెందరికో స్ఫూర్తి" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
Shaym Sundar
Jessy Prashanti
Salute
Police Duty Meet

More Telugu News