Tribal Youth: మావోయిస్టులకు వ్యతిరేకంగా మన్యంలో భారీ ర్యాలీ చేపట్టిన గిరిజనులు

Tribal youth took out a huge rally in G Madugula area
  • ఇటీవల ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
  • మావోల తీరును ఖండించిన గిరిజనులు
  • జి.మాడుగుల వద్ద భారీ ప్రదర్శన
  • వందల సంఖ్యలో హాజరైన గిరిజన యువత
ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను ఇటీవల మావోయిస్టులు హత్య చేయడం తెలిసిందే. దీనిపై గిరిజన యువత భగ్గుమంది. మావోయిస్టుల తీరును నిరసిస్తూ విశాఖ జిల్లా జి.మాడుగుల ప్రాంతంలో గిరిజన యువత భారీ ర్యాలీ చేపట్టింది. ఇద్దరు వ్యక్తులను హత్య చేయడాన్ని గిరిజనులు ఖండించారు. ఇన్ఫార్మర్ల పేరిట అమాయకులైన గిరిజనులను బలితీసుకోవద్దంటూ మావోయిస్టులను కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందల సంఖ్యలో గిరిజన యువత పాల్గొంది. మన్యం ఏరియాలో మావోలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శనలు నిర్వహించడం చాలా అరుదైన విషయం.
Tribal Youth
Rally
G Madugula
Informers
Maoists
Visakhapatnam District

More Telugu News