Melania Trump: వేసవి కంటే ముందే భర్తతో విడాకులు తీసుకోనున్న మెలానియా ట్రంప్

Melania likely to divorce US President Donald Trump soon
  • విడాకులు తీసుకోబోతున్నారని అంచనా వేస్తున్న జ్యోతిష్కులు
  • బిజినెస్ మేన్ తో డేటింగ్ చేస్తున్న మెలానియా
  • రానున్న రోజుల్లో ట్రంప్ మరింత ప్రభావశీలిగా మారుతారని అంచనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన భార్య మెలానియా ట్రంప్ త్వరలోనే విడాకులు ఇవ్వనున్నారు. ఈ వేసవి కంటే ముందుగానే విడాకులు ఇచ్చే అవకాశం ఉందని పలువురు జ్యోతిష్కులు అంచనా వేస్తున్నారు. కొందరు న్యూమరాలజిస్టులు కూడా ఇదే విషయాన్ని చెపుతున్నారు. మరోవైపు ఓ ప్రముఖ బిజినెస్ మేన్ తో మెలానియా డేటింగ్ చేస్తున్నారని... అయితే ఆ విషయాన్ని ఆమె గోప్యంగా ఉంచుతున్నారని చెపుతున్నారు.

 వైట్ హౌస్ ను వదిలిపెట్టిన తర్వాత రెండు నెలల పాటు డొనాల్డ్ ట్రంప్ మౌనంగా ఉంటారని... ఆ తర్వాత ఆయన మళ్లీ పురోగమిస్తారని అంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద డ్రైవింగ్ ఫోర్స్ గా మారుతారని... దేశాధ్యక్షుడిగా ఉన్నప్పటి కంటే మరింత ప్రభావశీలిగా తయారవుతారని చెపుతున్నారు. ఇదే సమయంలో మెలానియా జీవితం కూడా బాగుంటుందని అంటున్నారు.

మరోవైపు వైట్ హౌస్ లో బాధ్యతలను నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి ఇటీవల మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకుల కోసం మెలానియా నిమిషాలను లెక్కిస్తున్నారని ఆమె అన్నారు. అధ్యక్ష కార్యాలయం నుంచి ట్రంప్ బయటకు వచ్చే సమయం కోసం మెలానియా వేచి చూస్తున్నారని... ఈలోగా తాను ఏమైనా చేస్తే ట్రంప్ తనను శిక్షించే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నట్టు చెప్పారు.
Melania Trump
Donald Trump
USA
Divorce

More Telugu News