Vijayasai Reddy: కొట్లాటలు పెట్టడం కాకుండా మంచి సూచనలు ఇవ్వండి.. జగన్ స్వీకరిస్తారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy criticises opposition parties
  • ప్రభుత్వ పథకాల్లో తప్పిదాలు దొర్లితే ప్రతిపక్షం ఎత్తి చూపాలి
  • తప్పిదాలు లేకపోవడంతో విగ్రహాల ధ్వంసాలకు తెగబడుతోంది
  • కుట్రలకు పాల్పడిన వారు తప్పించుకోలేరు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ రోజు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల్లో ఏవైనా తప్పిదాలు దొర్లితే ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం... అలాంటివేమీ కనిపించకపోవడంతో గుళ్లు, విగ్రహాల ధ్వంసాలకు తెగబడుతోందని విజయసాయి మండిపడ్డారు. కొట్లాటలు పెట్టడం మాని, మంచి పనుల కోసం సూచనలు ఇస్తే... ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా స్వీకరిస్తారని చెప్పారు. కుట్రలకు పాల్పడిన వారెవరూ తప్పించుకోలేరని అన్నారు. చట్టం ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు.

రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి సీఐడీ విచారణకు ఆదేశించారని చెప్పారు. అంతకు ముందు అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. ఇదే సమయంలో కొత్త రథాన్ని ప్రభుత్వం తయారు చేయించిందని చెప్పారు. మత, కులతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ఏ రోజైనా తాను కూలగొట్టిన ఆలయాన్ని మళ్లీ నిర్మించారా? లేదా విచారణకు ఆదేశించారా? అని ప్రశ్నించారు.
Vijayasai Reddy
Jagan
YSRCP

More Telugu News