Dharmana Krishna Das: ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయి: డిప్యూటీ సీఎం ధర్మాన మండిపాటు

Dharmana Krishna Das praises Jagan amid attacks on Hindu temples
  • మేనిఫెస్టోను భగవద్గీతతో సమానంగా నమ్మే వ్యక్తి జగన్ అన్న ధర్మాన
  • తమకు అన్ని మతాలు, కులాలు సమానమే అని వ్యాఖ్య
  • దేవాలయాలపై దాడులు దురదృష్టకరమన్న డిప్యూటీ సీఎం 
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఈ రోజు అరసవెల్లి సూర్యనారాయణస్వామిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు అన్ని మతాలు, కులాలు సమానమే అని చెప్పారు. దేవాలయాలపై దాడులు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. విపక్షాల విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. మేనిఫెస్టోను భగవద్గీతతో సమానంగా నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని ఆయన అన్నారు.
Dharmana Krishna Das
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Temples
Andhra Pradesh

More Telugu News