Rajasekhar: మళ్లీ బీజేపీలో చేరిన జీవితారాజశేఖర్

Actor Jeevitha joins BJP
  • బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన జీవిత
  • ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన జీవిత, రాజశేఖర్
  • గతంలో బీజేపీలో కూడా ఉన్న రాజశేఖర్ దంపతులు
సినీనటి జీవితారాజశేఖర్ వైసీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదే సమయంలో గ్రేటర్ పరిధిలోని ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వీరందరికీ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి బండి సంజయ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీలో చేరేందుకు అన్ని పార్టీల నేతలు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అన్నారు.

గతంలో వైసీపీలో ఉన్న జీవిత, రాజశేఖర్ దంపతులు ఆ తర్వాత జగన్ ను విమర్శిస్తూ ఆ పార్టీని వీడారు. గత ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. జగన్ చాలా గొప్ప నాయకుడంటూ ప్రశంసించారు. ఇప్పుడు మళ్లీ వారు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గతంలో బీజేపీలో కూడా జీవిత, రాజశేఖర్ దంపతులు ఉన్నారు. రాజశేఖర్ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
Rajasekhar
Jeevitha
YSRCP
BJP
Bandi Sanjay

More Telugu News