Man: పంజాగుట్టలో ఆత్మహత్యకు యత్నించిన మానసిక రోగి... కాపాడిన స్వచ్ఛంద సంస్థ సిబ్బంది

Mentally ill man tries end his life in Punjagutta
  • రద్దీగా ఉండే ఫ్లైఓవర్ కింద మానసిక రోగి కలకలం
  • అడ్వర్టయిజ్ మెంట్ బాక్సు పైకెక్కి ఉరి వేసుకునే యత్నం
  • తాడును తొలగించిన స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది
  • బస్సు టాప్ పై పడిపోయిన యువకుడు
పంజాగుట్టలో నిత్యం రద్దీగా ఉండే ఫ్లై ఓవర్ కింద ఓ మానసిక రోగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఓ అడ్వర్టయిజ్ మెంట్ బాక్సు పైకెక్కిన యువకుడు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అంతలో అటుగా బస్సు రావడంతో దానిపై పడిపోయాడు. ఫ్లై ఓవర్ కొక్కేనికి అతడు ముడివేసిన తాడును ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన సిబ్బంది తొలగించడంతో అతడు ఉరివేసుకునే వీల్లేకపోయింది. దాంతో అక్కడ నిలిపిన బస్సుపై పడిపోయాడు. అతడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో దర్శనమిస్తోంది.
Man
Suicide
Punjagutta
Hyderabad

More Telugu News