Shobha Karandlaje: కమెడియన్ బ్రహ్మానందాన్ని అభినందించిన కన్నడ ఎంపీ శోభా కరంద్లాజె

BJP MP Shobha Karandlaje appreciates comedian Brahmanandam
  • పెన్సిల్ ఆర్ట్ తో వెంకటేశ్వరస్వామి చిత్రపటం గీసిన బ్రహ్మీ
  • అల్లు అర్జున్ కు బహూకరణ
  • స్పందించిన బీజేపీ మహిళా నేత
  • హాస్య బ్రహ్మికి నమో నమామి అంటూ వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం పెన్సిల్ ఆర్ట్ తో శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆయన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు బహూకరించారు. దీనిపై బీజేపీ నేత, కర్ణాటక మహిళా ఎంపీ శోభా కరంద్లాజె స్పందించారు. తెలుగు సినీ నటుడు బ్రహ్మానందం గారు అత్యద్భుతమైన రీతిలో చేతితో గీసిన చిత్రపటాన్ని అల్లు అర్జున్ కు కానుకగా ఇచ్చారని తెలిపారు.

ఈ వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని గీయడానికి బ్రహ్మానందం 45 రోజుల పాటు తదేక దీక్షతో శ్రమించారని శోభా కరంద్లాజె వెల్లడించారు. "హాస్య బ్రహ్మీ... మీకు నమో నమామి. మీరు మాకు స్ఫూర్తి కలిగించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు" అని కొనియాడారు. అంతేకాదు, బ్రహ్మీ గీసిన చిత్రపటం తాలూకు పిక్స్ ను కూడా ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
Shobha Karandlaje
Brahmanandam
Sri Venkateswara Swamy
Pencil Art

More Telugu News