Justice Hima Kohli: తెలంగాణ హైకోర్టు సీజేగా 5న జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం

Justice Hima Kohli take oath on 5th as TS High Court CJ
  • హిమా కోహ్లీతో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళసై
  • 6న ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం
  • 7న ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా రాఘవేంద్ర చౌహాన్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ఎల్లుండి (5న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయిన జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ఈ నెల 7న ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, 6న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జస్టిస్ హిమా కోహ్లీతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే, న్యాయమూర్తి జోయ్ మాల్య బాగ్చీ రేపు ఉదయం హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
Justice Hima Kohli
TS High Court
justice arup kumar goswami
AP High Court

More Telugu News