Tamilnadu: పూర్వజన్మలో శ్రీ వైకుంఠ రాజు తానేనట... కోట కోసం తవ్విస్తున్న తమిళ తంబీ!

Tamil Auto Driver Says he is King in Last Birth
  • ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న సుందరీ కన్నన్
  • కొంగరాయకురిచ్చి ప్రాంతంలో భారీ ఆలయం కట్టించానని వెల్లడి
  • తవ్వకాలను అడ్డుకున్న తహసీల్దారు

గత జన్మలో శ్రీ వైకుంఠం ప్రాంతాన్ని పరిపాలించిన రాజును తానేనని చెబుతూ, తమిళనాడు, తిరునల్వేలి ప్రాంతానికి చెందిన సుందరీ కన్నన్ అనే వ్యక్తి, ఆ ప్రాంతంలో తన కోట ఉందని చెబుతూ, తవ్వకాలు జరిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ఇక్కడికి సమీపంలోని రెడ్డియార్ పట్టి ప్రాంతంలో ఆటో డ్రైవర్ గా ఉన్న 47 ఏళ్ల సుందరీ కన్నన్, తనకు కొన్ని రోజులుగా పూర్వ జన్మ స్మృతులు గుర్తుకు వస్తున్నాయని చెబుతున్నాడు. తాను రాజుగా ఉన్న సమయంలో తంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మాణం జరిగిందని చెప్పాడు. తాను కొంగరాయకురిచ్చి ప్రాంతంలో భారీ ఆలయాన్ని కట్టించానని చెప్పాడు.

ఈ ప్రాంతంలోనే ఆలయం భూమిలో కూరుకుపోయిందని చెబుతూ కార్మికులను పెట్టి తవ్వకాలు ప్రారంభించాడు. తాను రాజుగా ఉన్న సమయంలో తన భార్యతో కలిసి బృహదీశ్వరాయలయంలో జరుగుతున్న తొలి మహా కుంభాభిషేకానికి బయలుదేరిన వేళ, తనను ప్రేమించిన సేవకురాలు విషం పెట్టి చంపివేసిందని అన్నాడు. ఇక, ఇతను సాగిస్తున్న తవ్వకాలను ఆ ప్రాంత తహసీల్దారు అడ్డుకున్నారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఇలా చేయడం నేరమని అతన్ని మందలించారు.

  • Loading...

More Telugu News