Pakistan: పాక్ క్రికెటర్ల వయసును పదేళ్ల వరకూ తక్కువ చేసి చూపుతున్నారు: మొహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు!

Pak Cricketers Age Scan Busted by Ex Pacer
  • బౌలర్ల వయసు 18 ఏళ్లుగా చూపుతున్నారు
  • నిజమైన వయసు 28 ఏళ్ల వరకూ
  • ఐదారు ఓవర్లకే అలసిపోతున్నారన్న ఆసిఫ్
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఆడుతున్న పేస్ బౌలర్లపై మాజీ సీమర్ మొహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జట్టులో ఉన్న వారి వయసు చాలా ఎక్కువని, కానీ వారి వయసును తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. వారి వయసుతో పోలిస్తే 9 నుంచి 10 ఏళ్ల వరకూ తక్కువగా ధృవపత్రాల్లో పేర్కొంటున్నారని అన్నారు.

పేసర్ల వయసును 17 లేదా 18 అని చూపిస్తున్నారని, కానీ వారి నిజమైన వయసు 27 లేదా 28 వరకూ ఉంటుందని, అందువల్లే వారిలో 20 నుంచి 25 ఓవర్ల పాటు బౌలింగ్ చేసే సత్తా ఉండటం లేదని అన్నారు. ఐదారు ఓవర్ల తరువాతనే వారు అలసిపోతున్నారని, దీని ప్రభావం ఫీల్డింగ్ పై కనిపిస్తోందని అన్నారు.

ఈ మేరకు కమ్రాన్ అక్మల్ నిర్వహిస్తున్న యూ ట్యూబ్ చానెల్ లో ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇదే సమయంలో ఎవరి వయసు ఎక్కువన్న విషయాన్ని మాత్రం ఆసిఫ్ బయట పెట్టక పోవడం గమనార్హం.
Pakistan
Cricket
Mohammad Asif

More Telugu News