Sajjala: చంద్రబాబు రాజకీయం కోసం దేవుడితోనే చెలగాటం ఆడుతున్నారు: సజ్జల

Sajjala says Chandrababu plays with god for politics
  • రామతీర్థంలో పోటాపోటీ పర్యటనలు
  • క్షేత్రాన్ని సందర్శించిన విజయసాయి, చంద్రబాబు
  • రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తతలు
  • టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్న సజ్జల
  • ఈసారి దేవుడు బాబును ఎక్కడ పెడతాడోనన్న సజ్జల
ఇవాళ  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు పోటాపోటీగా రామతీర్థంలో పర్యటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తమ జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబును ప్రజలు కిందికి దించి ఎక్కడ పెట్టారో మనం చూస్తున్నామని చురకంటించారు. ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ పై ఉందని, ఇప్పుడు అదే చంద్రబాబు రాజకీయం కోసం దేవుడితో చెలగాటం ఆడుతున్నారని సజ్జల విమర్శించారు. మరి ఆ దేవుడు బాబును, ఆయన పార్టీని ఇంకా ఎక్కడ పెడతారోనని వ్యాఖ్యానించారు.
Sajjala
Chandrababu
Ramatheertham
Telugudesam
YSRCP
Vijay Sai Reddy

More Telugu News