Sourav Ganguly: సౌరవ్​ గంగూలీకి గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిక!

Sourav Ganguly suffered a mild cardiac arrest and has been admitted to hospital
  • కోల్ కతా వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ లో చేరిక
  • సాయంత్రానికి యాంజియోప్లాస్టీ చేయాలన్న డాక్టర్లు
  • ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడి
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆయన్ను పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించారు. నేటి సాయంత్రం కల్లా ఆయనకు యాంజియో ప్లాస్టీ చేయాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Sourav Ganguly
BCCI

More Telugu News