Nara Lokesh: ఇక్కడ నా మీద పోటీ చేసి గెలవాలి!: నారా లోకేశ్ కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సవాల్ 

YSRCP MLA Siva Prasad Reddy challeges Nara Lokesh to contest on him
  • సుబ్బయ్యను చంపానని లోకేశ్ విష ప్రచారం చేస్తున్నారు
  • లోకేశ్ నాపై గెలిస్తే ఊరు వదిలి వెళ్లిపోతా
  • సారా కేసులో ముద్దాయి కోసం లోకేశ్ రావడం హాస్యాస్పదం
ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య తర్వాత వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ హత్యలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే  శివప్రసాదర్ రెడ్డి హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో శివప్రసాద్ రెడ్డి చౌడేశ్వరి అమ్మవారి పాదాల మీద ప్రమాణం చేసి హత్యతో తనకు సంబంధం లేదని చెప్పారు.

అనంతరం శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, సుబ్బయ్యను తానే హత్య చేశానని నారా లోకేశ్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని... దమ్ముంటే ప్రొద్దుటూరు నుంచి లోకేశ్ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. మంగళగిరిలో రూ. 100 కోట్లు ఖర్చు చేసినా లోకేశ్ గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. లోకేశ్ చేతిలో తాను ఓడిపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్పి, ఊరు వదిలి వెళ్లిపోతానని చెప్పారు. నాటు సారా కేసులో ముద్దాయి అయిన సుబ్బయ్య కోసం నారా లోకేశ్ రావడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మరోవైపు సుబ్బయ్య హత్య తర్వాత ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Nara Lokesh
Telugudesam
Siva Prasad Reddy
Proddatur
YSRCP

More Telugu News