Jagan: సీఎం జగన్ కు వేద ఆశీర్వచనాలు అందించిన టీటీడీ, కనకదుర్గ దేవస్థానం అర్చకులు

Priests from TTD and Kanakadurga temple blesses CM Jagan on new year day
  • ఇవాళ సంవత్సరాది
  • సీఎం క్యాంపు కార్యాలయంలో అర్చకుల సందడి
  • తరలివచ్చిన టీటీడీ, కనకదుర్గ ఆలయ వర్గాలు
  • వేద మంత్రోచ్చారణతో సీఎంకు ఆశీస్సులు
  • తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికల అందజేత
ఇవాళ నూతన సంవత్సరాది. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), విజయవాడ కనకదుర్గ ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి ఇవాళ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో శ్రీవారి సన్నిధి అర్చకులు విచ్చేశారు. సీఎం జగన్ ను వేదమంత్రోచ్చారణతో ఆశీర్వదించి, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు. అటు, బెజవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు కూడా అర్చకులతో సహా విచ్చేసి జగన్ ను కలిశారు. దుర్గ గుడి అర్చకులు సీఎం జగన్ కు తీర్థప్రసాదాలు అందించారు.
Jagan
TTD
Kanakadurga Temple
Blessings
New Year

More Telugu News