Nara Lokesh: ఈ దొంగ ఆరోపణలు ఎన్నాళ్లు జగన్ రెడ్డీ... సింహాచలం అప్పన్న సన్నిధికి రా తేల్చుకుందాం: నారా లోకేశ్ సవాల్

Nara Lokesh challenges CM Jagan to take on oath in Simhachalam Appanna Temple
  • ఏ1 సీఎం దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడని ఆగ్రహం
  • నీ బతుకు, నీ పాలన అంతా ఫేక్ అంటూ వ్యాఖ్యలు
  • ఆరోపణలు ఫేక్ అని పింక్ డైమండ్ తో తేలిందని వెల్లడి
  • ప్రమాణం చేద్దాం రావాలంటూ సీఎంకు స్పష్టీకరణ
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ అధినాయకత్వంపై  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏ1 క్రిమినల్ సీఎం తన బందిపోటు ముఠా నాయకుడు ఏ2 దొంగరెడ్డితో దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడని ఆరోపించారు. నీ బతుకు ఫేక్, నీ పార్టీ ఫేక్, నీ హామీలు ఫేక్, నీ పాలన కూడా ఫేక్ అంటూ మండిపడ్డారు. చివరికి నీ దొంగల బ్యాచ్ తో చేయించే ఆరోపణలు సైతం ఫేక్ అని పింక్ డైమండ్ వ్యవహారంతో తేలిందని లోకేశ్ స్పష్టం చేశారు.

"ఇంకెన్నాళ్లీ దొంగ ఆరోపణలు జగన్ రెడ్డీ! సింహాచలం అప్పన్న సన్నిధికి నువ్వే రా తేల్చుకుందాం. నువ్వు నాపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం... మరి నువ్వు సిద్ధమా?" అంటూ సవాల్ విసిరారు.
Nara Lokesh
Jagan
Challenge
Simhachalam Temple
Oath

More Telugu News