Morning Consult: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 55 శాతం మంది ప్రజల మద్దతు.. బోరిస్ జాన్సన్ పరిస్థితి దారుణం!

PM Modis Net Approval Rating At 55 percent
  • డేటా ట్రాకింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ సర్వే
  • మోదీ పనితీరును వ్యతిరేకిస్తున్న 20 శాతం మంది
  • బ్రిటన్ ప్రధానిని వ్యతిరేకించే వాళ్లే ఎక్కువ
ప్రపంచ నాయకులపై సర్వేలు నిర్వహించే డేటా ట్రాకింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ తాజా సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 55 శాతం ప్రజల మద్దతు ఉన్నట్టు పేర్కొంది. మోదీ పనితీరును దేశంలో 75 శాతం మంది ఆమోదిస్తున్నారని, అయితే వీరిలో 20 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. ఫలితంగా 55 శాతం మంది మద్దతు మోదీకి ఉన్నట్టు వివరించింది. దేశంలో మొత్తం 2,126 మందిని సర్వే చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు 24 శాతం మంది ప్రజల మద్దతు లభించగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టు తెలిపింది. ఆయన పనితీరుకు మద్దతు పలికే వారికంటే వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది.
Morning Consult
Narendra Modi
Boris Johnson
Angela Merkel

More Telugu News