Nara Lokesh: సుబ్బయ్య కుటుంబానికి రూ.34 లక్షలు అందిస్తున్నాం... పిల్లల చదువు బాధ్యత నాదే: లోకేశ్

Nara Lokesh says that will take care of Nandam Subbaiah children
  • కడప జిల్లాలో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య
  • సుబ్బయ్య కుటుంబానికి టీడీపీ రూ.20 లక్షల సాయం
  • కడప జిల్లా టీడీపీ నేతల నుంచి మరో రూ.14 లక్షలు
  • సుబ్బయ్ కాల్ డేటాను పరిశీలించాలన్న లోకేశ్
కడప జిల్లాలో హత్యకు గురైన టీడీపీ నేత నందం సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. నందం సుబ్బయ్య కుటుంబానికి టీడీపీ రూ.20 లక్షలు, కడప జిల్లా టీడీపీ నేతలు రూ.14 లక్షలు... మొత్తం రూ.34 లక్షలు ఇస్తున్నామని వెల్లడించారు. నందం సుబ్బయ్య పిల్లల చదువు బాధ్యతను తానే స్వీకరిస్తున్నట్టు లోకేశ్ స్పష్టం చేశారు. సుబ్బయ్య సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే ఎమ్మెల్యే అవినీతి, హత్య ఆధారాలు బయటపడతాయని తెలిపారు. పోలీసులు హామీ ఇచ్చిన మేరకు దర్యాప్తు జరగకపోతే తాను మళ్లీ ఉద్యమించక తప్పదని లోకేశ్ స్పష్టం చేశారు.
Nara Lokesh
Children
Nandam SUbbaiah
Telugudesam
Kadapa District

More Telugu News