BJP: రజనీకాంత్ మద్దతును కోరుతాం: బీజేపీ

will ask for rajani support bjp
  • మోదీ, రజనీ మధ్య ఉన్న ఆత్మీయత గురించి ప్రజలందరికీ తెలుసు
  • ఎన్నికల్లో మా పార్టీకి మద్దతివ్వాలని రజనీని అడుగుతాం
  • అన్నాడీఎంకే అభ్యర్థే తదుపరి సీఎం
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ప్రకటన
రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ యూటర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ ఇటీవల రజనీకాంత్ ప్రకటిస్తూ, ఇది దేవుడు చేసిన హెచ్చరికగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, తాము రజనీకాంత్ మద్దతును కోరుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ప్రకటించారు. ప్రధాని మోదీ, రజనీకాంత్ మధ్య ఉన్న ఆత్మీయత గురించి ప్రజలందరికీ తెలుసని తెలిపారు. తమిళనాడులో కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని రజనీని అడుగుతామని చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న సంకీర్ణంలో అన్నాడీఎంకే అతి పెద్ద పార్టీ అని ఆయన చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థే తదుపరి సీఎం అవుతారని స్పష్టం చేశారు. మరోవైపు, బీజేపీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తోన్న అన్నాడీఎంకే కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
BJP
Tamilnadu
Rajinikanth

More Telugu News