కుమారుడికి ఒక్క రూపాయి ఇవ్వకుండా.. సగం ఆస్తిని కుక్కకు రాసేసి, విశ్వాసం చూపిన తండ్రి!
- మిగతా సగ భాగం ఆస్తిని తన రెండో భార్య పేరున రాసిన వైనం
- కుమారుడి తీరు నచ్చక కోపంతో ఉన్న తండ్రి
- మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లాలో ఘటన
ఓం నారాయణ ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. తన కుమారుడితో విభేదాలు ఉండడంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తన భార్య, తన పెంపుడు కుక్క మాత్రమే తనను బాగా చూసుకుంటున్నారని ఆయన తెలిపాడు.
ఈ నేపథ్యంలో తన ఆస్తి మొత్తాన్ని వారిద్దరి పేరున రాస్తున్నానని, తాను మరణించినన తరువాత తన ఆస్తి మొత్తం తన భార్య, కుక్కకే చెందుతుందని తెలిపాడు. తన పెంపుడు కుక్కను ఎవరు చూసుకుంటారో దాని పేరున ఉన్న ఆస్తికి వారే వారసులు అవుతారని ఆయన చెప్పాడు.