Tulasi Reddy: జగన్ పాలనలో ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరవు: తులసిరెడ్డి
- సుబ్బయ్య మృతదేహానికి నివాళులు
- అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ మండిపాటు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయన్న కాంగ్రెస్ నేత
జగన్ మోహన్‌రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరవైందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత నందం సుబ్బయ్య మృతదేహానికి తులసిరెడ్డి నిన్న పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుబ్బయ్య హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవినీతిని ప్రశ్నించిన సుబ్బయ్యను చంపేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయనడానికి సుబ్బయ్య హత్య నిదర్శనమని తులసిరెడ్డి అన్నారు.