Tirumala: జనవరి స్పెషల్ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ!

January Special Darshan Tickets Released by TTD
  • రోజుకు 20 వేల టికెట్లు ఆన్ లైన్ లో
  • ఒక్కో యూజర్ ఐడీపై ఆరు టికెట్లు
  • తిరుమలలో డైరీలు, క్యాలెండర్ల కొరత
వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ముగియగానే, జనవరి 4 నుంచి 31 వరకూ రూ.300 ధరపై ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ ఉదయం విడుదల చేశారు. రోజుకు 20 వేల చొప్పున టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని, ఒక్కో యూజర్ ఐడీపై ఆరు వరకూ టికెట్లను కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి నిమిత్తం పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా భక్తులు అపురూపంగా చూసుకునే టీటీడీ కొత్త క్యాలెండర్లు, డైరీలకు తీవ్ర కొరత ఏర్పడింది. 2021 సంవత్సరానికి సంబంధించిన పెద్ద డైరీలు, 12 పేజీల క్యాలెండర్ల స్టాక్స్ లేవని భక్తులు అంటున్నారు. వైకుంఠ దర్శనాలకు వచ్చిన భక్తుల్లో అత్యధికులు ఈ క్యాలెండర్లు, డైరీల కోసం పుస్తక విక్రయశాలల వద్ద బారులు తీరుతున్నారు. చిన్న డైరీలు, చిన్న క్యాలెండర్లు, పంచాంగాలు, టేబుల్ క్యాలెండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, పెద్ద డైరీలను కూడా అందుబాటులో ఉంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Tirumala
Tirupati
TTD
Quota

More Telugu News