Nara Lokesh: ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణిచేస్తాం: నారా లోకేశ్

lokesh slams jagan
  • ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్
  • ఈ పాపం నిన్ను ఊరికే వదలదు
  • నీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు
  • చేనేత ‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని హత్యచేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణిచేస్తాం వైఎస్ జగన్. ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు. నీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. చేనేత ‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు’ అని లోకేశ్ చెప్పారు.

‘మీ అవినీతిని ఎండగట్టినందుకు కక్షగట్టి టీడీపీ జిల్లా అధికార‌ ప్ర‌తినిధి నందం సుబ్బయ్యను ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారు. హత్య చేసిన ఎమ్మెల్యే, అతని బావమరిది బంగారు రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.

‘వేట ‌కొడ‌వ‌ళ్ల‌తో తండ్రిని న‌రికేయించావు. నువ్విచ్చే ప‌రిహారంతో అనాథ‌లైన ఆ పిల్ల‌ల‌కు తండ్రిని తేగ‌ల‌వా? జ‌గ‌న్‌రెడ్డీ’ అని నారా లోకేశ్ ప్రశ్నించారు. 
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News