Vijayasai Reddy: నీ విభజించు, పాలించు సిద్ధాంతాలు బ్రిటీష్ వారిని మించిపోతున్నాయి బాబూ!: విజయసాయిరెడ్డి

YCP General Secretary Vijayasai criticizes TDP President Chandrababu
  • నిన్న వెలగపూడిలో తీవ్ర ఘర్షణలు
  • మహిళ మృతి
  • చంద్రబాబుపై విజయసాయి విమర్శనాస్త్రాలు
  • బీసీలు, దళితులు కలిసుంటే బాబుకు కడుపుమంట అంటూ వ్యాఖ్యలు
  • అందుకే చిచ్చుపెడుతున్నారని ఆరోపణ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. బీసీలు, దళితులు ఐక్యంగా ఉంటే చంద్రబాబుకు కడుపుమంట అని విమర్శించారు. అందుకే బీసీలు, దళితుల మధ్య చిచ్చుపెడుతున్నాడని అన్నారు. 'అది పలాస అయినా, వెలగపూడి అయినా నీ విభజించు, పాలించు సిద్ధాంతాలు బ్రిటీష్ వారిని మించిపోతున్నాయి... దిగజారుడు రాజకీయాలు చేయడానికి ఇది బ్రిటీష్ వారి కాలం కాదు బాబూ' అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు.

వెలగపూడిలో రోడ్డుపై ఆర్చి నిర్మాణం విషయంలో నిన్న రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి ఒక మహిళ మృతి చెందడం తెలిసిందే. చనిపోయిన మహిళ మృతదేహంతో బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో వెలగపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. హోంమంత్రి సుచరిత మృతురాలి కుటుంబీకులను పరామర్శించారు. నిన్న జరిగిన ఆ సంఘటనల నేపథ్యంలోనే విజయసాయి తాజా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
Vijayasai Reddy
Chandrababu
Velagapudi
Andhra Pradesh

More Telugu News