Nara Lokesh: చావుడ‌ప్పు మోగుతుంటే, ఏం పండ‌గ చేసుకోవాలి ముఖ్య‌మంత్రి గారు?: నారా లోకేశ్

767 farmers dead in 19 months says Nara Lokesh
  • 19 నెలల పాలనలో 767 మంది రైతులను మింగేశారు
  • రైతులు పండగ చేసుకోవాలంటూ సాక్షికి ప్రకటనలిస్తున్నారు
  • రైతుల ఇంట చావు డప్పులు మోగుతున్నాయి
వైసీపీ పాలనలో రైతులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. 19 నెలల పాలనలో 767 మంది రైతులను జగన్ మింగేశారని అన్నారు. రైతులు పండగ చేసుకోవాలంటూ తన దొంగ పేపర్ సాక్షికి కోట్లతో ప్రకటనలిస్తున్నారని మండిపడ్డారు. రైతింట చావుడప్పు మోగుతుంటే... ఏం పండుగ చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు? అని ప్రశ్నించారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News