Vijay: సుమారు మూడు గంటల నిడివితో విజయ్ 'మాస్టర్'!

Vijays Master run time locked
  • విజయ్ నటించిన తాజా చిత్రం 'మాస్టర్' 
  • జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
  • విలన్ గా కీలక పాత్రలో విజయ్ సేతుపతి
  • సినిమా నిడివి 178 నిమిషాలు  
మాస్ హీరో విజయ్ కు తమిళనాట వున్న ఫాన్ ఫాలోయింగ్ మనకు తెలిసిందే. రజనీకాంత్ తరవాత మళ్లీ అంతటి స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇక అతని సినిమాల విడుదల రోజున థియేటర్ల వద్ద అభిమానులు చేసే సందడి అంతాఇంతా కాదు. అదో పండగలా అభిమానులు సెలబ్రేట్ చేస్తూ, హడావిడి చేస్తారు.

ఈ నేపథ్యంలో వస్తున్న విజయ్ తాజా సినిమా 'మాస్టర్'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ విడుదల కాకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు కూడా.

సాధారణంగా విజయ్ సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో సాగుతాయి. ఇప్పుడీ చిత్రం రన్ టైమ్ కూడా 178 నిమిషాలకి సెట్ చేశారు. ఇందులో మరో పక్క కథానాయకుడు విజయ్ సేతుపతి విలన్ గా కీలక పాత్ర పోషించాడు. దాంతో సినిమాకి ఆ నిడివి అవసరం అవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి U/A  సర్టిఫికెట్ లభించింది. ఇందులో విజయ్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో కూడా అదే రోజున విడుదల చేస్తున్నారు.
Vijay
Vijay Setupati
Lokesh Kanagaraj

More Telugu News