Pawan Kalyan: విజయకీలాద్రి క్షేత్రంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

Janasena Chief pawan kalyan visits vijayakeeladri
  • గత రాత్రి దివ్యక్షేత్రాన్ని సందర్శించిన జనసేనాని
  • చినజీయర్ స్వామితో గంటపాటు చర్చ
  • వెంకటేశ్వర, వరాహ స్వామి ఆలయాల సందర్శన
కృష్ణా జిల్లా గుడివాడ, పెడన, మచిలీపట్నంలో జనసేన నిర్వహించిన ‘జై కిసాన్‌’ కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న రాత్రి విజయకీలాద్రిని దర్శించుకున్నారు. విజయవాడ సమీపంలోని సీతానగరం కొండపై కొలువైన దివ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర, వరాహ స్వాముల ఆలయాలను సందర్శించారు. అనంతరం చినజీయర్ స్వామితో గంటపాటు మాట్లాడారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పవన్ వెంట గుంటూరు పార్లమెంటు జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Pawan Kalyan
vijayakeeladri
Janasena
Vijayawada

More Telugu News