Ramcharan: మెగా హీరో రామ్ చరణ్‌కు కరోనా.. లక్షణాలు మాత్రం లేవంటూ ట్వీట్

Tollywood actor Ramcharan tested corona positive
  • వైరస్ సోకినట్టు ట్వీట్ చేసిన రామ్ చరణ్
  • ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని వెల్లడి
  • త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం
టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నాడు. అయితే, తనలో ఎటువంటి లక్షణాలు లేవన్నాడు. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు తెలిపాడు. త్వరలోనే కోలుకుని, తిరిగి మీ ముందుకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కాగా, రెండోది చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’.  
Ramcharan
Tollywood
Corona Virus
RRR

More Telugu News