Adibhatla: తిరిగి కాంగ్రెస్‌లో చేరిన ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్తిక గౌడ్

Adibhatla municipl chairperson Arthika goud joins in Congress
  • కాంగ్రెస్ నుంచి గెలిచి అనంతరం టీఆర్ఎస్‌లో చేరిక
  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో విభేదాలు
  • ఆర్తికపై కలెక్టర్‌కు కౌన్సిలర్ల ఫిర్యాదు
  • కోమటిరెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలోకి
హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్తిక గౌడ్ తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఐదుగురు కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన ఆమె ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం ఆమెకు చైర్ పర్సన్ పదవి లభించింది.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఇటీవల ఆమెకు విభేదాలు పొడచూపాయి. దీనికి తోడు పురపాలక కార్యాలయంలో ఆర్తిక భర్త జోక్యం చేసుకోవడం పలు విమర్శలకు దారితీసింది. దీనిపై 15 మంది కౌన్సిలర్లలో 14 మంది ఆమెపై జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు. డీపీవో శ్రీనివాస్‌రెడ్డి నిన్న విచారణ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిని కలిసిన ఆర్తిక.. టీఆర్ఎస్‌లో తాను ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Adibhatla
Congress
Telangana
Arthika Goud

More Telugu News