KCR: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష... తెలంగాణ జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ

CM KCR reviews on state water resources department
  • జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమావేశం
  • పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం
  • నీటిపారుదల రంగంలో మార్పులకు అనుగుణంగా నిర్ణయం
  • తెలంగాణ జలవనరుల శాఖలో పోస్టుల పెంపు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవనరుల శాఖపై ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర నీటిపారుదల రంగంలో వచ్చిన మార్పులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

పునర్వ్యవస్థీకరణ ప్రకారం... ఇకపై భారీ, మధ్య తరహా, చిన్న తరహా నీటిపారుదల విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. అంతేకాదు, ఒక ప్రాంతంలోని అన్నిరకాల జలవనరుల శాఖ వ్యవహారాల పర్యవేక్షణను ఒకే అధికారికి అప్పగించనున్నారు. జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా అధికారుల సంఖ్యను పెంచారు.

ఈ క్రమంలో రాష్ట్రాన్ని 19 ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించి ఒక్కో ప్రాంతానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమిస్తారు. జనరల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలను నియమిస్తారు. ఇప్పటికే ముగ్గురు ఈఎన్సీలు ఉండగా, కొత్తగా మరో ముగ్గురు రానున్నారు. సీఈ, ఎస్ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈ, టెక్నికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్లు, సూపరింటిండెంట్లు, రికార్డు అసిస్టెంట్ల సంఖ్యను పెంచనున్నారు.
KCR
Review Meeting
Water Resources
Telangana

More Telugu News