JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఉద్రిక్తత.. దుకాణాలు మూయించిన పోలీసులు!

High tension in Tadipatri after JC Prabhakar Reddy tried to go to PS
  • తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి
  • నేతల మధ్య వివాదంతో అట్టుడుకుతున్న తాడిపత్రి
  • జేసీపై కేసులను నమోదు చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య నెలకొన్న వివాదం వల్ల తాడిపత్రి పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయేందుకు జేసీ ఉన్నట్టుండి బయల్దేరారు. అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దని ఆయనను అనుచరులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

 మరోపక్క, పట్టణంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దుకాణాలను పోలీసులు మూసేయించారు. అంతేకాదు, జేసీ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల జేసీ తన ఇంట్లో లేని సమయంలో పెద్దారెడ్డి అక్కడకు వెళ్లి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
JC Prabhakar Reddy
Telugudesam
Pedda Reddy
YSRCP
Tadipatri

More Telugu News