Pakistan: ఐసీసీ ఈ దశాబ్దపు జట్లలో పాక్ ఆటగాళ్లకు దక్కని స్థానం.. అక్కసు వెళ్లగక్కిన రషీద్ లతీఫ్

  • ఈ దశాబ్దపు జట్లను ప్రకటించిన ఐసీసీ
  • అన్ని ఫార్మాట్లలో జట్ల ప్రకటన
  • కెప్టెన్లను కూడా ఎంపిక చేసిన ఐసీసీ
  • ఐపీఎల్ జట్టును కూడా ప్రకటిస్తే బాగుండేదని లతీఫ్ వ్యంగ్యం
No Pakistani player gets place in ICC teams of the decade

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇవాళ ఈ దశాబ్దపు క్రికెట్ జట్లను ప్రకటించింది. అన్ని ఫార్మాట్లలో జట్లను ప్రకటించి, కెప్టెన్లను కూడా ఎంపిక చేసింది. అయితే ఐసీసీ ఈ దశాబ్దపు జట్లలో ఒక్క పాకిస్థానీ క్రికెటర్ కు కూడా స్థానం లభించలేదు. దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ అక్కసు వెళ్లగక్కాడు.

టైప్ చేయడంలో పొరపాటు జరిగిందేమో.... ఈ దశాబ్దపు ఐపీఎల్ టీ20 జట్టు గురించి రాయడం మర్చిపోయుంటారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించాడు. ఐపీఎల్ లో రాణించినవాళ్ల పేర్లు మాత్రమే ఐసీసీ ఈ దశాబ్దపు జట్లలో పేర్కొందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. అయితే రషీద్ లతీఫ్ ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఐసీసీ బెస్ట్ టీమ్స్ కు ఎంపికైన వాళ్లందరూ మీ పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) లో ఆడనివాళ్లేనని, అదే మీ సమస్య అయ్యుంటుందని లతీఫ్ కు ఓ నెటిజన్ చురక అంటించాడు.

More Telugu News