Life Is Beautiful: మళ్లీ కలిసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' కుర్రాళ్లు... ఫొటోలు ఇవిగో!

Life Is Beautiful actors reunion at Vijaay Devarakonda home
  • 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం
  • ఈ చిత్రంలో నటించిన విజయ్, అభిజిత్, సుధాకర్
  • ప్రస్తుతం స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ
  • బిగ్ బాస్ విన్నరైన అభిజిత్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఎనిమిదేళ్ల కిందట రిలీజై యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఆ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ ఇవాళ స్టార్ హీరో. ఆ చిత్రంలో హీరో పాత్ర పోషించిన అభిజిత్ నేడు బిగ్ బాస్ రియాల్టీ షో విన్నర్ అయ్యాడు. యువ నటుడు సుధాకర్ కోమాకుల కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ప్రతిభావంతమైన నటన ప్రదర్శించాడు. ఈ ముగ్గురు తాజాగా విజయ్ దేవరకొండ ఇంట్లో కలిశారు.

తన మిత్రులు అభిజిత్, సుధాకర్ లను సాదరంగా ఆహ్వానించిన విజయ్ దేవరకొండ పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతేకాదు, ఆ సినిమాలో నటించిన ఇతర నటులతోనూ వీరు వీడియో కాలింగ్ ద్వారా ముచ్చటించారు. వీరికి విజయ్ దేవరకొండ సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
Life Is Beautiful
Vijay Devarakonda
Abhijeet
Sudhakar Komakula
Hyderabad

More Telugu News