Solo Brathuke So Better: రెండో రోజు కూడా వసూళ్ల దుమ్మురేపిన 'సోలో బ్రతుకే సో బెటర్'

Saitej new movie Solo Brathuke So Better swings Box Office collections
  • కిస్మస్ నాడు రిలీజైన సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'
  • తొలిరోజు రూ.4 కోట్లకు పైగా కలెక్షన్లు
  • రెండో రోజూ అదే ఒరవడి
  • రూ.3.29 కోట్ల గ్రాస్ వసూలు
మెగా హీరో సాయితేజ్, నభా నటేశ్ ప్రధానపాత్రల్లో నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన 'సోలో బ్రతుకే సో బెటర్' క్రిస్మస్ రోజున థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఓపెనింగ్స్ అదిరిపోవడంతో, తొలిరోజే రూ.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండోరోజు కూడా అదే దూకుడు కనబరిచింది. రెండో రోజున ఈ చిత్రం రూ.3.29 కోట్ల గ్రాస్ రాబట్టింది.

అటు, తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల షేర్ రూ.4.8 కోట్లు సాధించింది. మొత్తమ్మీద సాయితేజ్ కొత్త చిత్రం రెండ్రోజుల్లో రూ.7.99 కోట్ల గ్రాస్ తో నిర్మాతలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. అది కూడా 50 శాతం ప్రేక్షకులతోనే ఈ ఘనత సాధించడం విశేషం అని చెప్పాలి. కరోనా లాక్ డౌన్ ఆంక్షల సడలింపు అనంతరం థియేటర్లలో విడుదలైన తొలి తెలుగు చిత్రం సోలో బ్రతుకే సో బెటర్.
Solo Brathuke So Better
Collections
Second Day
Saitej
Nabha Natesh
Subbu
Tollywood

More Telugu News