Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్!

new 18732 new COVID19 infections in india
  • 24 గంటల్లో 18,732 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,87,850
  • మృతుల సంఖ్య 1,47,622
  • యాక్టివ్ కేసులు 2,78,690
భారత్‌లో గత 24 గంటల్లో 18,732 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 21,430 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,87,850కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 279 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,47,622 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 97,61,538 మంది కోలుకున్నారు.  2,78,690 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,81,02,657 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న  9,43,368 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News