Prathyusha: పెళ్లికూతురవుతున్న సీఎం కేసీఆర్ దత్తపుత్రిక

Prathyusha set to marriage
  • డిసెంబరు 28న ప్రత్యూష వివాహం
  • చరణ్ రెడ్డితో జీవితం పంచుకోనున్న ప్రత్యూష
  • రేపు ప్రధానం కార్యక్రమం
  • ఎల్లుండి పాటిగడ్డ చర్చిలో పెళ్లి
అప్పట్లో సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై సీఎం కేసీఆర్ ఔదార్యంతో చక్కని జీవితాన్ని పొందిన ప్రత్యూష ఇప్పుడు పెళ్లి చేసుకుంటోంది. ఈ నెల 28న ఆమె వివాహం చరణ్ రెడ్డితో ఓ చర్చిలో జరగనుంది. సవతి తల్లి చెర నుంచి విడుదలైన ప్రత్యూష తర్వాత కాలంలో నర్సింగ్ విద్య అభ్యసించి ఉద్యోగం సంపాదించింది. గత అక్టోబరులో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.

హైదరాబాదులోని రామ్ నగర్ కు చెందిన మర్రెడ్డి, జైన్ మేరీ దంపతుల కుమారుడు చరణ్ రెడ్డితో ఆమె వివాహం నిశ్చయమైంది. సీఎం కేసీఆర్ దత్తపుత్రికగా ప్రచారం అందుకున్న ప్రత్యూష వివాహం రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లూర్దు మాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరగనుంది.

కాగా, వరుడు చరణ్ రెడ్డితో ఆమెకు బంధుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రత్యూష పెళ్లి ఏర్పాట్లను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. ప్రత్యూష పెళ్లి నేపథ్యంలో రేపు బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో  ప్రధానం కార్యక్రమం నిర్వహించనున్నారు.
Prathyusha
KCR
Charan Reddy
Marriage

More Telugu News